Idols installed in reconstructed temples in Vijayawada
విజయవాడ నగరంలో 2016 కృష్ణా పుష్కరాల సమయంలో
తొలగించిన ఆలయాలనుపునర్నిర్మాణం
చేసిన సందర్బంగా ఈ ఉదయం 11.24 గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ
శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు కలశ
ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలలో వేద పండితుల
మంత్రోచ్చారణలు, అర్చక స్వాముల ప్రత్యేక పూజల మధ్య పాల్గొన్నారు.
ఒకే ముహూర్తం లో ఏడుచోట్లా జరిగిన ఈ క్రతువులో
మంత్రితో పాటుదేవదాయ
శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, దేవస్థానం చైర్మన్ కర్నాటి రాంబాబు,
కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు పాల్గొన్నారు. సీతమ్మ వారి పాదాలు
ప్రాంతం లో గల దక్షిణాముఖ ఆంజనేయస్వామి ఆలయం, సీతమ్మ
వారి పాదాలు, రధం సెంటర్ లో గల బొడ్డు బొమ్మ, కనకదుర్గ
అమ్మవారి పాతమెట్ల వద్ద నిర్మించిన ఆంజనేయ స్వామి, వినాయక
స్వామి ఆలయాల వద్ద పూజాదికములలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ధర్మ
కర్తలు బుద్దా రాంబాబు, బచ్చు మాధవీ కృష్ణ,స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఉప
ప్రధాన అర్చకులు శంకర శాండిల్య, దేవదాయ శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు.