KL Rahul out of and Bumrah in the fifth
test with England
ఇంగ్లండ్‌తో
భారత్ ఆడే ఐదవ, ఆఖరి టెస్ట్‌మ్యాచ్‌లోనూ వికెట్కీపఅర్ బ్యాట్స్‌మ్యాన్ కెఎల్
రాహుల్ ఆడడం లేదు. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో మార్చి 7నుంచి జరిగే ఆ మ్యాచ్‌కు
బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం అందుబాటులో ఉంటాడు.
ఇంగ్లండ్‌తో
టెస్ట్ సీరీస్‌లో మొదటి మ్యాచ్ హైదరాబాద్‌లో జరిగింది. ఆ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్
గాయపడ్డాడు. ఫలితంగా రెండు, మూడు, నాలుగవ మ్యాచ్‌లలో ఆడలేకపోయాడు. అతని ఫిట్నెస్ను
టీమ్ జాగ్రత్తగా గమనిస్తోంది. లండన్‌లోని ప్రత్యేక వైద్యనిపుణుల బృందం సాయంతో బీసీసీఐ
మెడికల్ టీమ్ అతని ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.
భారత
జట్టుకు ఊరట కలిగించే మరో అంశం ఏంటంటే, ఐదో టెస్ట్‌లో రైట్ ఆర్మ్ సీమర్ జస్ప్రీత్
బుమ్రా ఆడతాడు. అతను ధర్మశాలలో భారత జట్టుతో కలిసి అభ్యాసం చేస్తాడు.
మరో పేస్‌బౌలర్ మొహమ్మద్ షమీ కుడి మడమకు సోమవారం
ముంబైలో శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ విజయవంతమైందని, షమీ కోలుకుంటున్నాడనీ
బీసీసీఐ వెల్లడించింది. అతను త్వరలో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీకి వెడతాడు.
వాషింగ్టన్ సుందర్‌ను ఐదో టీమ్ జట్టు నుంచి
విడుదల చేసారు. అతను మార్చి 2నుంచి తమిళనాడు టీం తరఫున రంజీట్రోఫీ సెమీఫైనల్
మ్యాచ్‌లో ఆడతాడు. అవసరమనుకుంటే అతన్ని కూడా ఐదో టెస్ట్ మ్యాచ్‌కు ఎంపిక చేస్తారు.
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సీరీస్‌లో ఇప్పటికి జరిగిన నాలుగు మ్యాచ్‌లలో
భారత్ 3, ఇంగ్లండ్ 1 గెలిచాయి. మార్చి 7 నుంచి ధర్మశాలలో జరిగే ఐదో మ్యాచ్ ఫలితంతో
సంబంధం లేకుండా ఈ సీరీస్‌ను భారత్ గెలుచుకుంది.
ధర్మశాల టెస్ట్‌కు భారత జట్టు ఇదే:
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్
కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్
జురెల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, ఆర్ అశ్విన్,
రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్,
ఆకాష్ దీప్