ఈడీ
అధికారులపై దాడి కేసులో అరెస్టైన టీఎంసీ నేత షేక్ షాజహాన్‌కు రిమాండ్ విధించిన
బసిర్హాట్ న్యాయస్థానం, పదిరోజుల పోలీసుల కస్టడికీ అప్పగించింది.
పోలీసులు
14 రోజుల కస్టడీకి కోరినప్పటికీ న్యాయస్థానం పదిరోజులకే అనుమతించిందని షాజహాన్
తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది రాజా భౌమిక్ తెలిపారు. పోలీసు కస్టడీ అనంతరం,
మార్చి 10న కోర్టులో హాజరుపరచాలని జడ్జి ఆదేశించినట్లు తెలిపారు.
రేషన్
కుంభకోణం కేసు విచారణలో భాగంగా సోదాలు నిర్వహించేందుకు బెంగాల్ వెళ్ళిన ఈడీ
అధికారులు కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న
టీఎంసీ నేత, షేక్ షాజహాన్ ను నేటి ఉదయం పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.
సందేశ్‌ఖాలీ లో మహిళలపై లైంగికదాడి, భూకబ్జా కేసులో షాజహాన్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ
కేసులో కూడా నిందితుడిగా షాజహాన్ ను చేర్చారు.
గడిచిన 55 రోజులుగా పరారీలో ఉన్న
షాజహాన్ ను గురువారం ఉదయం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో రిమాండ్ కు
ఆదేశించిన న్యాయస్థానం, పదిరోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది.
షాజహాన్
అరెస్టుపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ స్పందించారు. ఈ ఘటన అక్రమార్కులకు
కనువిప్పు లాంటిదన్న ఆనంద బోస్, ఇది ఆరంభం మాత్రమే అన్నారు. బెంగాల్ లో హింస, దౌర్జన్యాలకు
చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం
కాకుండా సరైన చర్యలు తీసుకోవాలన్నారు. పశ్చిమబెంగాల్ లోని వివిధ ప్రాంతాల్లోని
గుండారాజ్యానికి తగిన చర్యలతో అడ్డుకట్ట వేయాలన్నారు.
షాజహాన్ అరెస్టుతో సందేశ్‌ఖాలీలో స్థానికులు సంబరాలు
చేసుకున్నారు. మహిళలు రోడ్లపైకి వచ్చి
ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు