మూడు దశాబ్దాల కిందట ముంబై రైళ్లలో జరిగిన బాంబుపేలుళ్ల కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న లష్కర్ ఏ తయ్యబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండాను రాజస్థాన్‌లోని ప్రత్యేక కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 1992లో బాబ్రి మసీదు కూల్చివేత జరిగిన ఏడాది పూర్తైన సందర్భంగా 1993లో ముంబై రైళ్లలో బాంబు పేలుళ్లకు పాల్పడినట్లు లష్కర్ ఏ తయ్యబా ప్రకటించిన సంగతి తెలిసిందే.
రైళ్లలో బాంబు పేలుళ్లకు పాల్పడిన కేసులో తుండాపై సరైన సాక్ష్యాలు లేకపోవడంతో నిర్ధోషిగా ప్రకటించింది. ఇదే కేసులో అమీనుద్దీన్, ఇర్ఫాన్లను రాజస్థాన్‌లోని ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. వీరిద్దరికీ న్యాయమూర్తి జీవిత ఖైదు విధించారు. 84 సంవత్సరాల తుండా అనేక బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతోనూ సంబంధాలున్నాయనే ఆరోపణలున్నాయి. బాంబులు తయారు చేయడంతో ఇతను దిట్ట.
ముంబై రైళ్లలో బాంబు పేలుళ్లు అప్పట్లో దేశాన్ని కుదిపేశాయి. ఆ తరవాత కోటా, కాన్పూర్, సికింద్రాబాద్, సూరత్‌లలో కూడా రైళ్లలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ కేసులను ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది.