ప్రభుత్వ
పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
11,062 పోస్టులతో ప్రకటన జారీ చేయగా, స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, 182 పీఈటీ ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఎస్జీటీ
పోస్టులు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్
అసిస్టెంట్లు 220, ఎస్జీటీ 796 పోస్టులను ఈ నోటిఫికేషన్ లో భర్తీ
చేయనున్నట్లు పేర్కొన్నారు.
మార్చి
4 నుంచి ఏప్రిల్ 2 వరకు డీఎస్సీ దరఖాస్తులు స్వీకరించనుండగా
దరఖాస్తు రుసుం రూ.1000 చెల్లించాల్సి ఉంది.
తెలంగాణ
వ్యాప్తంగా 11 పట్టణాల్లో ఆన్లైన్ పద్ధతిలో
పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్ష తేదీలను త్వరలో వెల్లడిస్తారు. గతంలో దరఖాస్తు
చేసిన అభ్యర్థులు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ స్పష్టం
చేవారు. కొత్త డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని తెలిపారు.
గతేడాది
సెప్టెంబరు 6న 5,089
పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ ప్రకటనను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం, పోస్టుల
సంఖ్యను పెంచి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.