తిరుపతి
శ్రీనివాసమంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల
సందర్భంగా ధ్వజారోహణం నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి
ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఉదయం 8.40 గంటల నుంచి 9 గంటల మధ్య మీనలగ్నంలో
ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రికి
పెద్దశేష వాహన సేవ జరగనుంది.
బ్రహ్మోత్సవాల
ప్రారంభం సందర్భంగా బుధవారం సాయంత్రం అంకురార్పణ జరిగింది. సుప్రభాతంతో స్వామిని
మేల్కొలిపి, కొలవు, పంచాగశ్రవణం చేపట్టారు.
బ్రహ్మోత్సవాల్లో
భాగంగా రేపు(మార్చి1) ఉదయం స్వామివారు
చిన్న శేష వాహనం, రాత్రికి హంస వాహనంపై నుంచి భక్తులను అనుగ్రహిస్తారు.
మార్చి
4న గరుడ వాహన సేవ, మార్చి 5న స్వర్ణరథం, మార్చి 7న రథోత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
తిరుమల శ్రీవారిని బుధవారం నాడు 66,915 మందిని
దర్శించుకోగా, 20,784 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల రూపంలో రూ. 3.87
కోట్ల ఆదాయం లభించింది. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం రెండు కంపార్టమెంట్లలో
భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.