భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు
(BCCI) (సీనియర్ మెన్) జట్టు సభ్యుల
వార్షిక కాంట్రాక్టు వివరాలు వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ 1 నుంచి ఈ
కాంట్రాక్టును వర్తింపజేయగా, ఈ సంవత్సరం
సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుంది.
గ్రేడ్ A+ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ,
జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉండగా, గ్రేడ్ ‘ఏ’ విభాగంలో ఆరుగురు ఆటగాళ్ళకు
బీసీసీఐ స్థానం కల్పించింది.
ఆర్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కేఎల్
రాహుల్, శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా A కేటగిరీలో ఉన్నారు.
ఇక ‘బి’ కేటగిరిలో ఆరుగురు
ప్లేయర్స్ ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్ దీప్ యాదవ్, అక్షర పటేల్,
యశస్వీ జైస్వాల్
గ్రేడ్ ‘సి’ : ఈ కేటగిరిలో 15 మందికి స్థానం
దొరికింది. రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దుల్ ఠాకూర్, శివమ్
దూబే, రవి బిష్ణోయ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజూ శామ్సన్,
అర్షదీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిధ్ క్రిష్ణ, ఆవేశ్ ఖాన్, రజత్ పటిదార్ లు గ్రేడ్
సి కాంట్రాక్టులో ఉన్నట్లు బీసీసీఐ ఓ
ప్రకటనలో తెలిపింది.
మూడు టెస్ట్ మ్యాచులు లేదా 8
వన్డేలు, లేదా 10 టీ20లు నిర్ణీత కాలంలో ఆడిన ఆటగాళ్లు గ్రేడ్ సీలోకి వస్తారు.
ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్, ఇప్పటికే రెండు టెస్టులు ఆడగా ధర్మశాలలో జరిగే మ్యాచ్
లో ఆడితే సీ గ్రేడ్ కాంట్రాక్టు పరిధిలోకి వస్తారు.
ఉమ్రాన్ బాలిక్, ఆకాశ్ దీప్,
విద్వంత్ కావేరప్ప, విజయ్ కుమార్, యశ్ దయాల్ లు ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్టు లో
ఉన్నారు.