హిమాచల్‌ప్రదేశ్‌లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు పడింది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌నకు పాల్పడి, బీజేపీ అభ్యర్థికి ఓటు
వేశారనే అనుమానంతో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ వేటు వేశారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధైర్యసాహసాలు ప్రదర్శించారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు చప్పట్లు కొడుతూ వారిని సభకు ఆహ్వానించారు. దీంతో వారంతా క్రాస్ఓటింగునకు పాల్పడ్డారని కాంగ్రెస్ భావించింది. అనర్హత వేటు పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో రాజిందర్ రానా, సుధీర్ శర్మ, ఇందర్ దత్ లఖన్‌పాల్, దేవిందర్ కుమార్ భుట్టో, రవి ఠాకూర్, చైతన్య శర్మ ఉన్నారు.
ఆర్ధిక బిల్లుకు వ్యతిరేకంగా ఆరుగురు సభ్యులు, పార్టీ విప్ ఉల్లంఘించారని, అందుకే వారిపై వేటు వేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్సింగ్ పఠానియా ఇవాళ ఉదయం ప్రకటించారు. 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తరవాత బడ్జెట్‌కు ఆమోదం లభించింది. ఆరుగురు కాంగ్రెస్ సభ్యులపై వేటు వేయడంతో, హిమాచల్‌ప్రదేశ్‌లో మరలా బీజేపీ అధికారంలోకి రాబోతోందనే వార్తలకు ముగింపు పలికినట్టైంది.