పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక దాడులు, భూ కబ్జాల ఆరోపణలు ఎదుర్కొంటోన్న షాజహాన్ షేక్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రత్యేక పోలీసు బృందం నార్త్ 24 పరగణాల జిల్లాలో షాజహాన్‌ను అర్థరాత్రి అరెస్ట్ చేసినట్లు ఇవాళ ఉదయం చెప్పారు. గడచిన 55 రోజులుగా షాజహాన్ షేక్ పరారీలో ఉన్నాడు. అరెస్ట్ అనంతరం అతన్ని బసిర్హత్ కోర్టుకు తరలించారు.
షాజహాన్‌ను అరెస్ట్ చేయలని కలకత్తా కోర్టు ఆదేశించిన మూడు రోజుల తరవాత ఎట్టకేలకు పోలీసులు ఆ పని పూర్తి చేశారు. ఈ నెల 26న షాజ్‌హాన్ అరెస్టును అడ్డుకోవడం లేదని కలకత్తా హైకోర్టు తేల్చి చెప్పింది.సందేశ్‌ఖాలీ కేసుపై ఎలాంటి స్టే లేదని కూడా ధర్మాసనం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
కోర్టుల వల్లే షాజహాన్‌ను అరెస్ట్ చేయడం సాధ్యం కావడం లేదంటూ తృణమూల్ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. కలకత్తా హైకోర్టుతోపాటు, గవర్నర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో షాజహాన్ అరెస్ట్ చూపారు. గత కొంత కాలంగా షాజహాన్ పోలీసుల అదుపులోనే ఉన్నాడని పశ్చిమబెంగాల్ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.