జ్యోతిర్లింగ
క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు
కానుకుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని
అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన నిఘా మధ్య ఉభయ దేవాలయాలు, పరివార దేవతాలయాల హుండీలలోని కానుకలు
లెక్కించారు.
గడిచిన
49 రోజులుగా
భక్తులు చెల్లించిన మొక్కులు, సమర్పించిన
కానుకలు నగదు రూపంలో రూ. 5,62,30,472
తేలింది. 398.8 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు 8 కేజీల వెండి ఆభరణాలు భక్తులు
సమర్పించారు. వీటితో పాటు విదేశీ కరెన్సీ కూడా ఆదిదంపతులకు సమర్పించారు.
శివమండల దీక్షను చేపట్టిన శివభక్తుల కోసం క్షేత్రంలో
దీక్షా విరమణ కార్యక్రమం మొదలైంది. మార్చి13 వరకు దీక్షా విరమణ కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11 వరకు జరగనున్న
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ను ఆలయ అధికారులు
ఆహ్వానించారు.