ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ
అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసు విచారణలో
భాగంగా రేపు(ఫిబ్రవరి29) విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సీబీఐ పేర్కొంది.
అఖిలేశ్ ను సాక్షిగానే విచారణకు పిలిచినట్లు నోటీసుల ద్వారా తెలుస్తోంది.
2012-2016 మధ్య హమీర్‌పూర్‌లో జరిగిన అక్రమ మైనింగ్‌పై నమోదైన కేసుకు కు
సంబంధించి సీబీఐ నోటీసులు జారీ చేసింది.
అక్రమ మైనింగ్‌కు అనుమతించిన అధికారులతో పాటు 11 మందిని ఎఫ్ఐఆర్లో
చేర్చారు. ప్రభుత్వ ఉద్యోగులు టెండర్ విధానాన్ని అనుసరించకుండా… చట్టవిరుద్ధంగా
లీజులు మంజూరు చేయడంతో పాటు అప్పటికే ఉన్న
లీజులను పునరుద్ధరించారని విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న అఖిలేష్ యాదవ్‌ను
సాక్షిగా సీబీఐ విచారణకు పిలిచింది.
కేంద్ర
దర్యాప్తు సంస్థ(సీబీఐ) సమన్లపై స్పందించిన అఖిలేశ్ యాదవ్, ఇండీ కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు
చేస్తోందని ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఉత్తర ప్రదేశ్‌లో ఏడుగురు ఎస్పీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు
పాల్పడటంతో బీజేపీ ఎనిమిదో రాజ్యసభ సీటును కూడా గెలుచుకుంది