-భారత ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ బాబూ
రాజేందప్రసాద్
భారత కాంగ్రెస్
కు 1934 లో అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్, 1950లో నూతన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత
దేశానికి 1952లో తొలి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. మళ్లీ 1957లో రెండోసారి కూడా
ఎన్నికై దేశానికి విలువకట్టలేని సేవలు అందించారు.
రాజేంద్రప్రసాద్,
డిసెంబరు 3, 1884న బిహార్ లో జీరాదేయి గ్రామంలో జన్మించారు. 1893 వరకు పారశీక గురువు
వద్ద ప్రాథమిక విద్య, అనంతరం
కాలేజీ చదువులు సర్.జగదీష్చంద్రబోస్ వంటి ప్రముఖల వద్ద అభ్యసించారు. మాస్టర్ ఆఫ్ లా డిగ్రీ పూర్తి
చేసి కోల్కతా హైకోర్టులోనూ, పాట్నా హైకోర్టు లోనూ న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. న్యాయశాస్త్రంలో
డాక్టరేట్ డిగ్రీ కూడా సాధించారు.
పాట్నా పురపాలక సంఘానికి
అధ్యక్షుడిగా పనిచేశారు. బిపిన్ చంద్రపాల్, అరవిందఘోష్ లాంటి
మహా వ్యక్తుల వ్యాసాలతో మరింత ప్రభావితులయ్యారు.
1929 లో
బిహార్ మహాసభలో సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని కోరుతూ తీర్మానం చేయడంతో ఆయనను అప్పటి
బిట్రీషు ప్రభుత్వం నిర్బంధించి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
1946 సెప్టెంబర్లో
నెహ్రూ నాయకత్వంలో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వంలో వ్యవసాయ శాఖామంత్రిగా నియమితులయ్యారు.
అనంతరం రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. వీరు అందించిన సేవలకు
గాను భారత ప్రభుత్వం 1962లో భారతరత్న అవార్డు ను అందచేసింది. 1963 ఫిబ్రవరి 28న రాజన్ బాబు తుదిశ్వాస విడించారు. వీరి జయంతి
అయిన డిసెంబరు 3న న్యాయవాదుల
దినోత్సవంగా నిర్వహిస్తారు.
‘‘సోమనాథ్, రాజేందప్రసాద్, జవహర్లాల్- ఈ పేర్లతో
ముడిపడిన వివాదం అప్పట్లో అందరికీ ఎరుకే. ప్రఖ్యాత పత్రికా రచయిత, ‘ఇండియా ఫ్రం కర్జన్ టు
నెహ్రూ’ గ్రంథకర్త దుర్గాదాస్ ఈ విషయాన్ని ఓ సారి ప్రస్తావించారు.
బిహార్ లోని ఓ మారుమూల గ్రామంలో పుట్టి స్వతంత్రభారతదేశానికి
రెండుసార్లు ఏకగ్రీవంగా రాష్ట్రపతిగా ఎన్నికై సేవలందించిన మహోన్నతుడు డాక్టర్ బాబూ
రాజేంద్రప్రసాద్.