తెలుగుదేశం
పార్టీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా చేశారు. కష్టకాలంలో టీడీపీకి
అండగా నిలిచినప్పటికీ చంద్రబాబు తన కష్టాన్ని గుర్తించలేదన్నారు. చంద్రబాబుకు
బహిరంగ లేఖ రాసిన గొల్లపల్లి సూర్యారావు, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు
రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
2019 నుంచి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా,
రాజోలు నియోజకవర్గ ఇంఛార్జ్ గా పనిచేసిన
సందర్భాన్ని లేఖలో చంద్రబాబుకు గుర్తు చేశారు. పార్టీ పిలుపు మేరకు ప్రతీ కార్యక్రమాన్ని
విజయవంతం చేసినప్పటికీ తనను గుర్తించకపోవడం బాధకరమన్నారు. తన ఆత్మగౌరవానికి భంగం
కలిగినందున టీడీపీలో కొనసాగలేక రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
రాజోలులో
అసెంబ్లీ టికెట్ ఇవ్వకుండా తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన కూటమి ప్రకటించిన ఉమ్మడి
ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాలో గొల్లపల్లి పేరు లేకపోవడంతో ఆయనక కలత చెందారు.
పొత్తులో
భాగంగా రాజోలు సీటును జనసేనకు టీడీపీ వదిలేసింది.
గొల్లపల్లి
సూర్యారావు త్వరలో వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఓ దఫా ఆ పార్టీ
నేతలతో చర్చించారని, త్వరలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు
సమాచారం.