Rajiv Murder Case Convict Dies
రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా జీవితఖైదు శిక్ష
అనుభవించిన శాంతన్, ఇవాళ తెల్లవారుజామున మరణించాడు. జీవితఖైదు తర్వాత విడుదల అయిన
శాంతన్ కాలేయం అనారోగ్యానికి చికిత్స పొందుతున్నాడు.
చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ వైద్య కళాశాలలో
కాలేయ రోగానికి చికిత్స తీసుకుంటున్న 55 ఏళ్ళ శాంతన్ చనిపోయినట్లు ప్రకటించారు.
‘కాలేయం పనితీరు వైఫల్యం చెందడం కారణంగా శాంతన్ మరణించాడు’ అని వైద్య కళాశాల డీన్
ఇ తేరనిరాజన్ వెల్లడించారు. ‘మృతదేహానికి అటాప్సీ చేస్తాం. కళేబరాన్ని శ్రీలంక
పంపించడానికి చట్టపరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి’ అని వివరించారు.
మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీని 1991లో హత్య
చేసిన కేసులో శాంతన్ 20ఏళ్ళకు పైగా శిక్ష అనుభవించాడు. 2022లో సుప్రీంకోర్టు
అతన్ని విడుదల చేసింది. ఆ తర్వాత, మరో ముగ్గురు దోషులతో కలిసి శాంతన్ తిరుచ్చిలోని
ప్రత్యేక క్యాంపులో నివసిస్తున్నాడు. అతన్ని శ్రీలంకకు పంపించేందుకు ఏర్పాట్లు
జరుగుతున్నాయి. అంతలోనే ఇలా తుదిశ్వాస విడిచాడు.