లోక్‌పాల్‌కు
ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్‌రావ్
ఖాన్విల్కర్ ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.
జుడీషియల్
సభ్యులుగా హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లింగప్ప
నారాయణస్వామి, అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన
న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ యాదవ్, లా
కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి వ్యవహరించనున్నారు.
నాన్
జుడిషియల్ సభ్యులుగా కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ సుశీల్‌చంద్ర, పంకజ్‌కుమార్, మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ టిర్కీని నియమిస్తూ
ఉత్తర్వులు జారీ చేశారు.
లోక్‌పాల్
తొలి ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ పినాకి చంద్రఘోష్ 2019 మార్చి 23 నుంచి 2022 మే 27వరకు సేవలు అందించారు.
అప్పటి
నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. ఇంతకాలం ఇంతకాలం తాత్కాలిక
చైర్‌పర్సన్‌గా లోక్‌పాల్ సభ్యులు జస్టిస్ ప్రదీప్ కుమార్ మెహంతీ వ్యవహరించారు.
మహారాష్ట్రలోి
1957 జులై 30న పుణెలో జన్మించిన ఖాన్విల్కర్, 1984లో
సుప్రీంకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితంలోకి అడుగుపెట్టారు. కేంద్ర ఎన్నికల
సంఘం స్టాండింగ్ కౌన్సిల్ లో సేవలందించారు.
బొంబాయి
హైకోర్టు న్యాయమూర్తిగా, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ హైకోర్టులకు ప్రధాన
న్యాయమూర్తిగా కీలక తీర్పులు వెలువరించారు. 2016 మే
13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా
నియమితులయ్యారు.