పలు రాష్ట్రాల పరిధిలో నిన్న15 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగగా,
బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. ఉత్తరప్రదేశ్ లో 10, కర్ణాటకలో నాలుగు, హిమాచల్‌ప్రదేశ్ లో ఒక
స్థానానికి పోలింగ్ జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, 8 రాజ్యసభ స్థానాలు కైవసం చేసుకోగా,
మిగతా రెండు స్థానాలు విపక్ష సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకుంది.
రాజ్యసభ
ఎన్నికలతో బీజేపీ విజయ యాత్ర మొదలైందన్న ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్
మౌర్య, లోక్‌సభ ఎన్నికల్లోనూ జైత్రయాత్ర కొనసాగుతుందన్నారు.
కర్ణాటకలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా… కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు హస్తంగతం చేసుకోగా
ఓ స్థానంలో బీజేపీ విజయం సాధించింది.
హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులిద్దరికీ
సమానంగా 34 ఓట్లు లభించాయి. దాంతో ‘టాస్’
విధానాన్ని అనుసరించగా బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ విజేతగా నిలిచారు.