ఆంధ్రప్రదేశ్లో
బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగిందని కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భవిష్యత్లో
ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడ, విశాఖ, ఏలూరులో బీజేపీ ఆధ్వర్యంలో
నిర్వహిస్తోన్న వివిధ కార్యక్రమాల్లో రాజ్నాథ్ సింగ్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం
చేశారు.
కేంద్రప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
విశాఖలో
‘భారత్ రైజింగ్ అలైట్ మీట్’ పేరుతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న, రాజ్నాథ్
సింగ్… గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం
పూర్తిస్థాయిలో నెరవేర్చిందన్నారు. ఆర్టికల్ 370, ట్రిపుల్
తలాక్లను కేంద్రప్రభుత్వం, రద్దు చేసిందని గుర్తుచేసిన రాజ్ నాథ్, త్వరలోనే
ఉమ్మడి పౌరసత్వాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని వెల్లడించారు.
భారతదేశం 2027
నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. డిజిటల్
ఎకానమీలో భారతదేశం మొదటి స్థానంలో ఉందన్నారు.