The families who
lost everything in Godhra train carnage
(గోద్రా రైలు దహనకాండలో 59మంది హిందువులు అసువులు
బాసినది ఈరోజే)
27 ఫిబ్రవరి 2002… ఏ హిందువూ మరచిపోలేని భయంకరమైన రోజది. ఇస్లామిక్
జిహాదీ ముష్కరులు గుజరాత్‌లోని గోద్రా రైల్వేస్టేషన్లో సబర్మతి ఎక్స్‌ప్రెస్
ఎస్6 బోగీకి నిప్పంటించి 59మంది ప్రాణాలు తీసిన రోజు. ఆ సంఘటనే గోద్రా నరమేధంగా,
గోద్రా రైలు దహనకాండగా నిలిచిపోయింది.
ఆరోజు ఇస్లామిక్
జిహాదీల దాడిలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలు ఈనాటికీ ఆ షాక్ నుంచి
కోలుకోలేదు. ఎన్నో కుటుంబాలు తమ ఇంటిపెద్దలను, ఇంటిని పోషించేవారిని కోల్పోయి
కకావికలమైపోయాయి. వారిలో చాలామంది ఇప్పుడు దుర్భర పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు.
కొన్ని కుటుంబాలైతే పూర్తిగా నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. గోద్రా రైలు
దహన ఘటనలో సమస్తం కోల్పోయిన, అహ్మదాబాద్‌కు చెందిన రెండు కుటుంబాల గురించి
తెలుసుకుందాం.
వస్త్రాల్
ప్రాంతంలోని సురేలియా ఎస్టేట్‌లో నివసించే సోనీ కుటుంబం, ఇద్దరు ప్రధాన
కుటుంబసభ్యులను కోల్పోయింది. మన్సుఖ్భాయ్ కాంజీభాయ్ సోనీ, ఆయన 22ఏళ్ళ కొడుకు
జేసల్కుమార్ మన్సుఖ్భాయ్ సోనీ గోద్రా రైలు దహన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
విషాదమేమంటే, ఆ
దుర్ఘటన జరిగిన నాటికి జేసన్‌భాయ్ కూతురు ఆరునెలల పసిబిడ్డ. ఆ దురదృష్టకరమైన రోజున
ఆ కుటుంబంలోని అత్తాకోడళ్ళిద్దరూ తమ మాంగళ్య సౌభాగ్యాన్ని పోగొట్టుకున్నారు. జేసన్‌భాయ్
భార్య అప్పటికి ఇంకా చిన్నవయసుది కావడంతో ఆమెకు మళ్ళీ వివాహం చేసారు. కొంతకాలానికి
మన్సుఖ్భాయ్ భార్య మరణించారు. అలా, అహ్మదాబాద్‌లో సోనీ కుటుంబం
తుడిచిపెట్టుకుపోయింది.
సోనీల కుటుంబంలాంటిదే
మరో కుటుంబం రామోల్కు చెందిన పాంచాల్ కుటుంబం. గోద్రా రైలు దహనం ఘటన జరిగిన రోజు
సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో పాంచాల్ కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు అదే బోగీలో
ఉన్నారు. హర్షద్భాయ్ హరగోవింద్భాయ్ పాంచాల్, ఆయన భార్య నీతాబెన్ హర్షద్భాయ్
పాంచాల్, వారి ముగ్గురు కూతుళ్ళు
ప్రతీక్ష, ఛాయ, గాయత్రి ఆ రైల్లో ఉన్నారు. అదే కుటుంబానికి చెందిన మిగతా ముగ్గురు
కూతుళ్ళూ మరీ చిన్నపిల్లలు కావడంతో వారు ఇంట్లోనే ఉండిపోయారు. ఇస్లామిక్ జిహాదీ ఛాందసవాదులు
సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టి హిందువులను చంపివేసిన ఘటనలో గాయత్రి తప్ప
మిగతా నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. గాయత్రి కొద్దిపాటి గాయాలతో ఎలాగోలా తప్పించుకోగలిగింది.
అలా పాంచాల్ కుటుంబం
గోద్రా రైలు దహన ఘటన తర్వాత ఇంటిని పోషించే మగదిక్కు లేనిదైపోయింది. 15ఏళ్ళు కూడా
లేని నలుగురు ఆడపిల్లలు అనాథల్లా మిగిలారు. వారి జీవితాలు అతలాకుతలమైపోయాయి.
ఈ రెండు కుటుంబాలు
మాత్రమే కాదు, 22ఏళ్ళ క్రితం గోద్రా రైలు దహన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 59మంది వ్యక్తుల
కుటుంబాలకూ పూడ్చలేని లోటే మిగిలింది. అయోధ్య రామజన్మభూమిలో రామమందిరం నిర్మించబడాలన్న
కోరికతో కరసేవకు వెళ్ళివస్తున్న హిందువులతో నిండివున్న రైలు మీద ముస్లిం దుండగులు
దాడి చేసారు. సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్6 బోగీని తగలబెట్టేసారు. ఆ జిహాదీ
ఛాందసవాదులు 59 నిండుప్రాణాలను బలి తీసుకున్నారు. ఆ కుటుంబాల కన్నీళ్ళు వరదలై నేటికీ
పారుతూనే ఉన్నాయి.