వైసీపీ నాయకుల వేధింపులకు వ్యాపారులే కాదు, క్రీడాకారులు కూడా బలికావాల్సి వస్తోంది. తాజాగా రంజీ క్రికెట్ ఆటగాడు హనుమ విహారి తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.ఏడేళ్లపాటు రంజీ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా హనుమ విహారి వ్యవహరించారు. అయితే కొంత కాలం కిందట రంజీ క్రికెట్ జట్టులో 17వ ఆటగాడిగా ఉన్న పృథ్వీరాజ్‌ను కెప్టెన్ విహారి మందలించాడు. అతను ఆ విషయాన్ని తండ్రికి తెలియజేశాడు. పృథ్వీరాజ్ తండ్రి తిరుపతి కార్పొరేటర్ నర్సింహాచారికి కోపం తెప్పించింది. అనుకున్నదే తడవుగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లో ఫిర్యాదు చేశారు. హనుమ విహారి కెప్టెన్సీ పీకేయించారు.
తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఏపీ జట్టు 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తరవాత అతనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో హనుమ విహారి ఇక ఏపీ తరపున రంజీ క్రికెట్లో ఆడనంటూ ఇన్‌స్టాలో తన ఆవేదనను పంచుకున్నారు. ఇప్పుడు హనుమ విహారి పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. వైసీపీ నేతల దెబ్బకు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలే కాదు. క్రీడాకారులను కూడా బలిపెడుతున్నారనే విమర్శలొస్తున్నాయి.
‘‘పశ్చిమ్ బెంగాల్‌లో ఇటీవల జరిగిన రంజీలో మొదటి మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాను. ఆ సమయంలో 17వ ఆటగాడు పృథ్వీరాజ్‌పై కొప్పడ్డాను. వెంటనే అతను తన తండ్రికి ఆ విషయం చేరవేశాడు. వైసీపీ నేత, కార్పొరేటర్ నరసింహాచారి తనపై ఏసీఏకి ఫిర్యాదు చేశాడని హనుమ ఇన్‌స్టా పోస్ట్‌లో వెల్లడించారు’’
బెంగాల్‌లో జరిగిన మ్యాచ్‌లో 400 పరుగుల లక్ష్యం పెట్టినా, పోరాడి గెలిచినట్లు గుర్తుచేశారు. మ్యాచ్ నెగ్గినా తనను కెప్టెన్సీ నుంచి రాజీనామా చేయాలంటూ ఏసీఏ ఆదేశించినట్లు హనుమ తీవ్ర మనోవేదనను వ్యక్తం చేశారు. తన తప్పు లేకపోయినా కెప్టెన్సీ నుంచి తొలగించడాన్ని హనుమ జీర్ణించుకోలేకపోతున్నారు. చేయని తప్పుకు తనను బలిచేశారని, ఇక ఏపీ నుంచి రంజీ క్రికెట్ ఆడనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.