ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ హర్యానా రాష్ట్ర అధ్యక్షుడు నఫే సింగ్ రాఠీ హత్య వెనుక బ్రిటన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ హస్తం ఉందని చండీగఢ్ పోలీసులు అనుమానిస్తున్నారు. నఫే సింగ్ హత్య వెనుక ప్రమేయం ఉన్న వారిని గుర్తించేందుకు గ్యాంగ్‌స్టర్ సన్నిహితులను విచారిస్తున్నారు. నఫేసింగ్ కారులో ప్రయాణిస్తోండగా జజ్జర్ జిల్లాలో దుండగులు కాల్పులు జరిపి చంపేశారు. ఈ కేసులో 15 మందిపై కేసు నమోదైంది. ప్రముఖ రాజకీయ నాయకులతో సంబంధాలున్న వీరేంద్ర రాఠా, సందీప్ రాఠీ పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.
నషేసింగ్ హత్యలో యూకేలో నివశిస్తోన్న భారత్‌కు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్ ప్రమేయం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. గ్యాంగ్‌స్టర్ ముఠా సభ్యులతో బీజేపీ మాజీ ఎమ్మెల్యే నరేశ్ కౌశిక్‌కు కూడా సంబంధాలున్నాయని తెలుస్తోంది. అతని పేరును కూడా నఫేసింగ్ హత్య కేసులో చేర్చారు. తీహార్ జైల్లో పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తోన్న కొందరు ఖైదీలను కూడా పోలీసులు విచారిస్తున్నారు. నఫేసింగ్ హత్య కేసును సీబీఐకి అప్పగిస్తామని హర్యానా సీఎం ప్రకటించారు.
గత ప్రభుత్వంపై ఉపముఖ్యమంత్రి డ్రగ్స్ వ్యాఖ్యల కలకలం