టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో, అహోబిలం మఠం, శ్రీవారి కైంకర్యాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై వేటు వేశారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డి, రమణ దీక్షితులను తొలగిస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. రమణ దీక్షితులు…. ఈవో ధర్మారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
తిరుమలలో కొన్నేళ్లుగా అరాచకాలు చోటు చేసుకుంటున్నాయని, అన్యమత ప్రచారం పెరిగిపోయిందని, గుప్త నిధుల కోసం కూడా తవ్వకాలు చేస్తున్నారంటూ రమణ దీక్షితులు మాట్లాడినట్లుగా ఉన్న వీడియో వైరల్ అయింది. అయితే ఆ వీడియో తనది కాదంటూ ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న రమణ దీక్షితులు మీడియాలో మాట్లాడుతూ, అలాంటి వ్యాఖ్యలు తాను చేయలేదని, అయినా
ఆ వీడియో తానే చేశానంటే చేయగలిగిందేమీ లేదని వ్యాఖ్యానించారు.