ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదు సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవచ్చంటూ వారణాసి జిల్లా కోర్టు తీర్పును, అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. వారణాసి జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ, కొందరు అలహాబాద్ హైకోర్టులో రివ్యూ పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు జ్ఞానవాపి మసీదు సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవచ్చని సంచలన తీర్పు వెలువరించింది.
కోర్టు ఆదేశాల మేరకు సర్వే చేసిన ఏఎస్ఐ, జ్ఞానవాపి మసీదులో హిందూ దేవాలయాలకు చెందిన ఆధారాలు లభించాయని భారత ఆర్కియాలజీ సర్వే తేల్చి చెప్పింది. ఔరంగజేబు పరిపాలనా సమయంలో హిందూ దేవాలయంలో మసీదు నిర్మించారని ఏఎస్ఐ సర్వేలో తేలింది. ఆర్కియాలజీ సర్వే ఆధారంగా విచారణ జరిపిన వారణాసి కోర్టు, మసీదు సెల్లార్లో పూజలకు హిందువులను అనుమతించింది. దీనిపై కొందరు అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. వారి పిటీషన్ను అలహాబాద్ హైకోర్టు కోట్టివేసింది.