మాల్దీవుల్లో వందలాది భారత సైనికులు తిష్టవేశారని, తాను అధికారంలోకి రాగానే వారిని పంపించి వేస్తానంటూ ఆ దేశ అధ్యక్షుడు మయిజ్జు ఎన్నికల ప్రచారంలో అబద్దాలు చెప్పారంటూ ఆ దేశ విదేశాంగ మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ కొట్టిపారేశారు. మాల్దీవుల్లో సాయుధులైన భారత సైనికులు ఎవరూ లేని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రచారంలో మయిజ్జు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని అబ్దుల్లా షాహిద్ డిమాండ్ చేశారు. మయిజ్జు మూడు నెలల పాలనలో ఎన్నో అబద్దాలు చెప్పాడని విమర్శించారు.
మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసిన మయిజ్జు, గత ఎన్నికల్లో వందలాది భారత సైనికులు మాల్దీవుల్లో ఉన్నారంటూ అసత్య ప్రచారం చేశారు. భారత సైనికులను వెనక్కు పంపిస్తామనే నినాదంతోనే ఆయన ఎన్నికల్లో నెగ్గారు. అయితే మాల్దీవుల్లో సాయుధులైన భారత సైనికులు ఎవరూ లేకపోవడంతో ఆయన ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు