రాంచీ టెస్టు మూడోరోజు ఆటలో భారత్ బౌలర్ల అదరగొట్టారు. భారత స్పిన్నర్లు
రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్
యాదవ్ దెబ్బకు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 145 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్
ఐదు వికెట్లు తీయగా, కుల్దీప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. జడేజాకు ఒక వికెట్
దక్కింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో జాక్ క్రాలే (60) రాణించగా బెయిర్ స్టో (30)
ఫరవాలేదు అనిపించాడు. మిగతా వారంతా పెవిలియన్
కు క్యూకట్టారు.
ఇంగ్లండ్
సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాసేపటికే భారత్ కు వికెట్ దక్కింది. అశ్విన్
వేసిన 4.5 బంతికి బెన్ డకెట్(15) క్యాచ్ ఔట్ గా వెనుదిరగడంతో 19 పరుగులు వద్ద
ఇంగ్లండ్ తొలి వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత
ఒంతికే ఓలీ పోప్ కూడా పెవిలియన్ చేరాడు.
16.6
బంతికి అశ్విన్ కు మూడో వికెట్ దక్కింది. జోరూట్(11)ను అశ్విన్ వెనక్కిపంపాడు.
దీంతో 17 ఓవర్లకు ఇంగ్లండ్ మూడు వికెట్లు నష్టపోయి 65 పరుగులు చేసింది. జాక్
క్రాలే మాత్రం హాప్ సెంచరీ పూర్తి
చేశాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 28.1
బంతికి జాక్ క్రాలే(60) కూడా ఔట్ కావడంతో 112 పరుగుల వద్ద ఇంగ్లండ్ నాలుగో
వికెట్ కోల్పోయింది. తర్వాతి వికెట్ ను కూడా కుల్దీప్ తన ఖాతాలో వేసుకున్నాడు.
32.3 బంతికి స్టోక్స్( 4) బౌల్డ్ అయ్యాడు. 120 పరుగుల వద్ద ఐదు, ఆరు వికెట్లను
ఇంగ్లండ్ కొల్పోయింది. జడేజా బౌలింగ్ లో బెయిర్ స్టో ( 30) ఆరో వికెట్ గా
పెవిలియన్ చేరాడు.
కుల్దీప్
వేసిన 40.3 బంతిని ఆడిన హార్ట్ లే( 7), సర్ఫరాజ్ కు క్యాచ్ అందించి ఔట్ అయ్యాడు. 133
పరుగుల వద్ద ఏడు, ఎనిమిది వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్, జట్టు స్కోర్ 145 వద్ద
ఉన్నప్పుడు తొమ్మిదో వికెట్ నష్టపోయింది. అశ్విన్ బౌలింగ్ లో బెన్ ఫోక్స్ ( 17)
ఔట్ అయ్యాడు. అండర్సన్ (0) అశ్విన్ బౌలింగ్ లో వెనుదిరగడంతో ఇంగ్లండ్ సెకండ్
ఇన్నింగ్స్ ముగిసింది.
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని భారత్ ముందు 192 పరుగుల విజయలక్ష్యాన్ని
ఉంచింది. ఛేదనలో భాగంగా భారత్ మూడో రోజు
ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. కెప్టెన్
రోహిత్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (16) తో
క్రీజులో ఉన్నారు.