గుంటూరు జిల్లా మంగళగిరిలో 183 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఎయిమ్స్ ఆసుపత్రిని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. అధునాతన ఆసుపత్రితోపాటు, మెడికల్ కళాశాల నిర్మాణం కోసం గడచిన అయిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.1618 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం స్థలం సమకూర్చింది. 2015 డిసెంబరు 19న ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేశారు. 2019 మార్చి నాటికి కొన్ని భవనాలు పూర్తి చేశారు. అప్పటి నుంచే ఓపీ సేవలు ప్రారంభించారు.
2020 నుంచి ఇన్ పేషెంట్ సేవలు ప్రారంభించారు. ఇప్పటి వరకు దాదాపు లక్ష మందికి ఎయిమ్స్‌లో వైద్య సేవలు అందించారు. 15 పడకల ఈ ఆసుపత్రి పేదలకు అన్ని రకాల సేవలను అతి తక్కువ ఫీజులతో అందించనుంది. ప్రధాని మోదీ గుజరాత్‌లోని రాజ్‌కోట్, బటిండా ఆసుపత్రులను కూడా ప్రారంభించారు. ప్రధాని మోదీ ఆన్లైన్ ద్వారా ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి విడదల రజని, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఎయిమ్స్‌లో 41 విభాగాలు పూర్తి స్థాయిలో సేవలందించనున్నాయి.