లోక్‌సభ
ఎన్నికలకు ముందు బీఎస్సీకి ఎదురుదెబ్బ తగిలింది. అంబేద్కర్‌నగర్ ఎంపీ రితేష్ పాండే బీఎస్పీకి
రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్
సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.
గత
పదిహేనుళ్ళుగా బీఎస్పీ కోసం పనిచేశానని తెలిపిన రితేష్ పాండే, మాయావతి ఆలోచనా సరళి
గురించి ప్రస్తుతం ఎలాంటి వ్యాఖ్య చేయదలచుకోలేదన్నారు. తన రాజీనామా లేఖలో అన్ని
విషయాలను క్షుణ్ణంగా మాయావతికి
వివరించినట్లు చెప్పారు.
బీజేపీ
పాలనలో ఉత్తరప్రదేశ్ లో ముమ్మరంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని
కొనియాడిన రితేష్ పాండే, గోరఖ్‌పూర్ లింక్ ఎక్స్‌ప్రెస్ వే, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్
వే, నిర్మాణంతో పాటు తన నియోజకవర్గమైన అంబేద్కర్‌నగర్ నుంచి అయోధ్యకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం
జరుగుతుందన్నారు.
బీజేపీ
ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలతో పేదలు, రైతులు, మహిళలు, దళితుల ఆర్థిక స్థితి,
జీవనప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు.
రితేశ్
పాండే, బీజేపీలో చేరికను స్వాగతించిన యూపీ ఉపముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్, చాలా ధైర్యంగా
ముందడుగు వేశారని కొనియాడారు.
పది
రోజుల కిందట ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన రితేష్ పాండే, అందుకు సంబంధించిన
ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రధాని పనితీరుపై ప్రశంసలు కురిపించారు.