భారత
కేంద్ర ఎన్నికల సంఘం పేరిట, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త, ఫేక్ గా
తేలింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్
19 న జరుగుతుందని, ఫలితాలు మే 22న విడుదల అవుతాయనేది సదరు కల్పిత, తప్పుడు వార్త
సారాంశం. సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్ అవుతున్న ఈ వార్త గురించి ఎన్నికల
సంఘం దృష్టికి తీసుకెళ్ళగా తప్పుడు వార్త అంటూ నిర్ధారించింది. తాము ఎలాంటి
షెడ్యూల్ ప్రకటించలేదని స్పష్టం చేసింది.
మార్చి 12 నుంచి దేశం అంతటా ఎన్నికల మోడల్ కోడ్ అమలులోకి వస్తుందని, నామినేషన్ల
దాఖలకు మార్చి 28 ఆఖరి రోజు అంటూ సదరు పేక్ మేసేజ్ లో పేర్కొన్నారు. కేంద్రం
ఎన్నికల సంఘం పేరిట నకిలీ లెటర్ హెడ్ లో ఎన్నికల షెడ్యూల్, పలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది.
దీనిపై స్పందించిన భారత కేంద్ర ఎన్నికల సంఘం సదరు వార్త అధికారికం కాదని
తేల్చింది. ఫేక్ మెసేజ్ ను సృష్టించారని నిర్ధారించింది.
ఎన్నికల షెడ్యూల్ వివరాలను
ఎలక్షన్ కమిషన్, ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తుందని తెలిపారు. మెసేజ్ లు నిజమో
కాదో నిర్ధారించుకున్న తర్వాత ఇతరులతో పంచుకోవాల్సి సూచించింది.