మహాశివరాత్రి సందర్భంగా జ్యోతిర్లింగం,
శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మార్చి 1
నుంచి 11 వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
జరగుతున్నాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండే
అవకాశం ఉండటంతో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలను
రద్దు చేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.
స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే
అనుమతి ఉంటుందని ఈవో పెద్దిరాజు వెల్లడించారు.శివస్వాములకు మార్చి1 నుంచి 5 వరకు నిర్దిష్ట వేళ్లలో ఉచిత స్పర్శ దర్శనానికి
అవకాశం కల్పిస్తామన్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వివరాలు…
మార్చి 1 : ధ్వజారోహణ, శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం
ఆధ్వర్యంలో పట్టువస్త్రాలు సమర్పణ
మార్చి 2 :భృంగి వాహన సేవ
మార్చి 3: హంసవాహన సేవ, శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ వారిచే స్వామిఅమ్మవార్లకు పట్టు
వస్త్రాలు సమర్పణ
మార్చి 4 : మయూరవాహనసేవ, కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే
పట్టు వస్త్రాలు సమర్పణ
మార్చి 5: రావణ వాహన సేవ, పట్టు వస్త్రాలు సమర్పించనున్న రాష్ట్రప్రభుత్వం
మార్చి 6: పుష్ప పల్లకీ సేవ
మార్చి 7 : గజవాహనసేవ
మార్చి 8: మహాశివరాత్రి ప్రభోత్సవం, నంది వాహనసేవ, స్వామివారికి లింగోద్భవకాలంలో
మహారుద్రాభిషేకం, కళ్యాణోత్సవం
మార్చి 9: రథోత్సవం, తెప్పోత్సవం
మార్చి 10: ధ్వజావరోహణ
మార్చి 11 : అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు