తిరుమల శ్రీవారి ఆలయంపై గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై టీటీడీ సైబర్ సెక్యూరిటీ సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ జీఎం మురళి సందీప్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మురళి ఫిర్యాదు మేరకు పోలీసులు రమణ దీక్షితులుపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…
గత శనివారం రమణదీక్షితులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కౌకంర్యాలు ఎలా జరుగుతున్నాయని అడగ్గా, గతంలో మాదిరి జరుగుతున్నాయన్నారు. మీపై కేసు నమోదైందని అడగ్గా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వాయిస్ తనది కాదని, అయినా తనను ముద్దాయిలా చూస్తే చేయగలిగింది ఏమీ లేదన్నారు.
తిరుమలలోని అహోబిల మఠం ప్రతిష్ఠ మంటగలిచేలా రమణదీక్షితులు వ్యాఖ్యలు చేశారని కూడా టీటీడీకి ఫిర్యాదు అందింది. అహోబిల మఠం అధికారి పద్మనాభచారియర్ రమణదీక్షితులపై చర్యలు తీసుకోవాలని టీటీడీకి లేఖ రాశారు.