గుజరాత్లో
పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ, రూ.
52, 250కోట్ల విలువైన ప్రాజెక్టులను
ప్రారంభిస్తున్నారు. పర్యటనలో భాగంగా అరేబియా సముద్రంపై నిర్మించిన సుదర్శన్
వంతెనను ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఈ బ్రిడ్జి పొడవు 2.3 కిలోమీటర్లు కాగా, రూ. 979 కోట్లు వెచ్చించి నిర్మించారు.
ఓఖా ప్రాంతాన్ని బెట్ ద్వారకతో కలిపేందుకు ఈ బ్రిడ్జిని నిర్మించారు.
ద్వారకాదీశుడి
దర్శనానికి వచ్చే భక్తులకు ఈ వంతెన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
27.20
మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలతో నిర్మించిన ఈ బ్రిడ్జిపై 2.5 మీటర్ల వెడల్పైన
నడకబాటను కూడా నిర్మించారు. వంతెనకు ఇరువైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు ఉంచారు. పలు
చోట్ల సోలార్ ప్యానళ్ళు ఏర్పాటు చేసి ఒక మెగావాట్ విద్యుత్‌ను ఉత్పత్తి
చేయనున్నారు.
ద్వారకలో
రూ.4,150 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. దీని తర్వాత
మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రధాని మోదీ రాజ్‌కోట్‌కు వెళ్లనున్నారు. సాయంత్రం 4:30
గంటలకు రాజ్‌కోట్‌లోని రేస్ కోర్స్ గ్రౌండ్లో రూ. 48,100 కోట్ల విలువైన పలు
అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు.