ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య ఆరు వారాల కాల్పుల విరమణకు పారిస్ వేదికగా చర్చలు జరుగుతున్నాయి.కాల్పుల విరమణపై ఇప్పటికే ఒక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. 300 మంది పాలస్తీనా ఖైదీల విడుదలకు బదులుగా, 40 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసేందుకు ఇరువర్గాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
పారిస్‌లో జరిగిన చర్చలపై వార్ కేబినెట్‌లో మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఇజ్రాయెల్ రాయబారులు ప్రకటించారు. ఇజ్రాయెల్ చేస్తోంది నరమేధమంటూ బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ద సిల్వ తీవ్ర విమర్శలు చేశారు. చిన్నారులను,మహిళలను దారుణంగా హతమారుస్తున్నారని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ నరమేధానికి తలపడతోందంటూ దక్షిణాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. గాజాలోని వెస్ట్‌బ్యాంక్‌లో 3500 ఇళ్లు నిర్మిస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్ర విమర్శలు చేశారు. ఇజ్రాయెల్ చర్యలను తప్పుపట్టారు.