అయోధ్య
బాల రామయ్య దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.
నేపాల్ విదేశాంగ మంత్రి ఎన్ పి సౌద్, ఆయన భార్య జ్యోత్స్నాసౌద్, నేడు బాల రాముణ్ణి దర్శించుకుని ఐదు రకాల వెండి కానుకలు
సమర్పించారు. వీటిలో విల్లు, గద, కంఠహారం, చేతలు, కాళ్ళకు ధరించే కంకణాలు ఉన్నాయి.
కాసేపట్లో సరయూ నది ఒడ్డున నిర్వహించే
హారతి కార్యక్రమంలో సౌద్ దంపతులు పాల్గొంటారు. హనుమాన్‌గర్హి ఆలయాన్ని కూడా
సందర్శిస్తారు. అయోధ్య
రామమందిర ప్రారంభోత్సవానికి ముందే నేపాల్, 1,100 రకాల కానుకలు పంపింది. నేపాల్
లోని జానకి మందిర్ పూజరి మహంత్ రామ్ రోషన్ బృందం, దుస్తులు, ఆభరణాలు, వెండిపాత్రలు
రామజన్మభూమి ట్రస్ట్ కు అందజేసింది.
సీతమ్మవారి జన్మస్థలంగా భక్తులు విశ్వసించే
నేపాల్ లోని జనక్‌పుర్ నుంచి ఈ కానుకలు పంపారు. సాలిగ్రామ రాయి, పవిత్ర జలాలు కూడా
నేపాల్ దేశం అందజేసింది.