రాంచీ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య
జరుగుతున్న నాలుగో టెస్ట్ లో రెండో రోజు ఆట కొనసాగుతోంది. మొదటి రోజు స్కోరు 302/7 వద్ద రెండో
రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు మరో 51 పరుగులు జోడించి 353 పరుగులకు ఆలౌటైంది.
ఆఖరి మూడు వికెట్లను రవీంద్ర జడేజా తన
ఖాతాలో వేసుకున్నాడు. రాబిన్సన్(58), షోయబ్ బషీర్ (0), జేమ్స్ అండర్సన్ (0)
పరుగుల వద్ద ఔట్ కాగా, జో
రూట్ (122) నాటౌట్‌గా
నిలిచాడు.
తొలి రోజు ఆటను ప్రారంభించిన
భారత్, నాలుగు పరుగులు వద్ద తొలి వికెట్ నష్టపోయింది. కెప్టెన్ రోహత్ శర్మ(2) జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో ఫోక్స్‌కి క్యాచ్ ఇచ్చి
వెనుదిరిగాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్( 43),
శుభ్‌మన్ గిల్(38) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. 24 ఓవర్లకు ఒక
వికెట్ నష్టానికి 85 పరుగులు చేశారు.
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీయగా, ఆకాశ్ దీప్ మూడు, సిరాజ్
2, అశ్విన్ ఒక వికెట్ తీశారు.