వైసీపీ నరసాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి పంపించారు. రఘురామకృష్ణరాజును ఎంపీ పదవికి అనర్హుడిగా చేసేందుకు ఆ పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక త్వరలో సార్వత్రిక ఎన్నికలు కూడా ఉండటంతో రఘురామకృష్ణరాజు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వెంటనే ఆమోదించాలంటూ ఆ లేఖలో జగన్మోహన్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. నరసాపురం అభిృద్ధికి తనవంతు కృషి చేస్తానని, ప్రజలంతా మార్పు కోసం తీర్పు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా లేఖపై వైసీపీ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. రాజీనామా లేఖను ఆమోదిస్తారా? లేదా? అనేది త్వరలో తేలనుంది. టీడీపీ,జనసేన కూటమి నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు పలు సందర్భాల్లో రఘురామకృష్ణరాజు స్వయంగా వెల్లడించారు.