ఎన్నిక్లలో
బీజేపీని ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర
అధ్యక్షురాలు పురందరేశ్వరి అన్నారు. ఎన్నికలకు బీజేపీ సన్నద్ధంగా ఉందన్న పురందరేశ్వరి,
ప్రజాపోరు యాత్రలో రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో వివరిస్తామన్నారు. విజయవాడలో
నిర్వహించిన బీజేపీ రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొన్న
పురందరేశ్వరి, నేతలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించే విషయంపై సమాలోచనలు చేశారు.
అయోధ్య
రామమందిర నిర్మాణ కలను సాకారం చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. పొత్తులపై
అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని మరోమారు స్పష్టం చేశారు.
వాలంటీర్లు
బూత్ ఏజెంట్లుగా ఉండాలంటూ మంత్రి ధర్మాన వ్యాఖ్యానించడం ఎన్నికల నియమావళికి
విరుద్ధమన్నారు. ఓటర్లు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసేలా వాలంటీర్లు చూడాలంటూ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించిన విషయంపై కూడా
ఈసీకి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.
సమావేశంలో
బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహ రావు, బీజేపీ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ పాల్గొన్నారు.