తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లి, రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కేసును రివ్యూ చేయాలంటూ భారత్ కోరింది. అక్కడి పోలీస్ అధికారి కెవిన్పై నేరాభియోగాలు మోపకపోవడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్ణయాన్ని రివ్యూ చేయాలని భారత్ కోరింది. జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రయత్నాలు చేస్తున్న విదేశాంగ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
కందుల జాహ్నవి కేసులో దర్యాప్తు రిపోర్టు భారత అధికారులకు అందాల్సి ఉంది. అమెరికాలోని సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు, భారత రాయబార కార్యాలయ అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి గత ఏడాది జనవరిలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. పోలీస్ పెట్రోల్ వాహనం ఢీ కొట్టడంతో ఆమె మరణించిన సంగతి తెలిసిందే. సాక్ష్యాలు లేకపోవడంతో పోలీసు అధికారిపై నేరాభియోగాలు మోపడం లేదని స్థానిక కోర్టు తీర్పు వెలువరించడంపై భారత్ రివ్యూ కోరింది.