లోక్సభలో ప్రశ్నలు వేసేందుకు డబ్బు తీసుకున్నారనే ఆరోపణలపై ఎంపీ పదవి కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. విదేశీ ద్రవ్య నిర్వహణ చట్టం కింద నమోదైన కేసులో, రహస్య సమాచారాన్ని ఈడీ మీడియాకు లీక్ చేస్తోందని, దాన్ని ఆపాలంటూ మహువా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మహువా అభ్యర్థనను డిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
మహువా అభ్యర్థనపై విచారించిన జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ ధర్మాసనం కేసును కొట్టేసింది. మహువా తరపున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఈడీ సమన్లు మహువాకు అందకముందే మీడియాకు ఎలా అందుతున్నాయని ఆయన ప్రశ్నించారు. మహువాకు ఈ నెల 15న సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.