చైనా హ్యాకింగ్ ముఠాల అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయి. తాజాగా భారత సంస్థలపై దాడి చేశారు. కీలక సమాచారం దొంగిలించారు. పలు దేశాల నుంచి కీలక సమాచారం కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. దీనిపై వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం ప్రచురించింది. చైనా ప్రభుత్వ మద్దతుతోనే హ్యాకర్లు చెలరేగిపోయినట్లు తెలుస్తోంది.
కంపెనీలు, ప్రభుత్వాల కీలక సమాచారం లక్ష్యంగా చేసుకుని చైనా హ్యాకర్లు దాడులకు తెగబడినట్లు వాషింగ్టన్ పోస్ట్ వివరించింది. సాప్ట్‌వేర్ లోపాలను ఆసరాగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. చైనా వాణిజ్య రాజధాని షాంఘైలోని ఐసూన్ కంపెనీకి చెందిన హ్యాకర్లు కీలక సమాచారం తస్కరించినట్లు ఆ పత్రిక పేర్కొంది.
చైనా ప్రభుత్వానికి ఈ సంస్థ హ్యాకింగ్ సేవలు అందిస్తోంది. హ్యాకర్ల ద్వారా విదేశాలకు చెందిన కీలక సమాచారం కాజేసి చైనాకు అప్పగించడమే ఐసూన్ పనిగా పెట్టుకుంది. ఇందుకు చైనాతో ఎంఓయూలు కూడా చేసుకుంది. భారత్, తైవాన్, బ్రిటన్, మలేషియాతోపాటు మరో 20 దేశాల సమాచారం చైనా హ్యాకర్లు కాజేశారంటూ వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన కథనం ఇప్పుడు సంచలనంగా మారింది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు