రాంచీలోని
JSCA వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న
నాలుగో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న
ఇంగ్లండ్ జట్టు, 90 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 302 పరుగులు చేసింది.
లంచ్
విరామానికి ముందు 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఆ తర్వాత
పుంజుకుంది.
జోరూట్ సెంచరీ తో ఆదుకున్నాడు. బెన్ ఫోక్స్ తో కలిసి వికెట్ల పతనానికి
అడ్డుకట్ట వేశాడు. 126 బంతుల్లో 47 పరుగులు చేసిన బెన్ ఫోక్స్ ను సిరాజ్ పెవిలియన్
కు పంపగా ఆ తర్వాత సిరాజ్ బౌలింగ్ లోనే టామ్ హర్టే లే( 13) ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ ఏడో వికెట్
కోల్పోయింది.
తొలి
రోజు ఆట ముగిసే సమయానికి జో రూట్(106),
రాబిన్సన్(31) క్రీజులో ఉన్నారు.
జో రూట్, 226 బంతులు ఆడి 106 పరుగులు
సాధించాడు. అతడి ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు,
11 డబుల్స్, 48 సింగిల్స్ ఉన్నాయి.
బెన్
డకెట్(11), ఇంగ్లండ్ తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. జట్టు స్కోర్ 47 పరుగుల
వద్ద ఆకాశ్ దీప్ బౌలింగ్ లో
ధ్రువ్
జురైల్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చి ఓలీపోప్, రెండు
బంతులు ఆడి డకౌట్ గా వెనుదిరిగాడు. ఓపెనర్ జాక్ క్రాలే, ఆకాశ్ దీప్ బౌలింగ్ లోనే
మూడో వికెట్ గా ఎల్బీ అయ్యాడు. జాక్ క్రాలే 42 బంతుల్లో 42 పరుగులు చేసి బౌల్డ్
అయ్యాడు. దీంతో 57 పరుగులు వద్ద ఇంగ్లండ్
మూడో వికెట్ నష్టపోయింది.
ఆ తర్వాత 109 పరుగుల వద్ద జానీ బెయిర్ స్టో( 38) కూడా అశ్విన్
బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. 109 పరుగుల వద్ద నాలుగో వికెట్
నష్టపోయిన ఇంగ్లండ్, 112 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. బెన్ స్టోక్స్ (3)
వికెట్ను రవీంద్ర జడేజా తన ఖాతాలో వేసుకున్నాడు. 225 పరుగుల వద్ద ఆరో వికెట్ గా
బెన్ ఫోక్స్ వెనుదిరగగా, టామ్ హార్ట్ లే ఏడో వికెట్ గా ఔట్ అయ్యాడు.
అరంగేట్ర
పేసర్ ఆకాశ్ దీప్ మూడు వికెట్లు తీయగా,
సిరాజ్ రెండు, అశ్విన్, జడేజా చెరొక వికెట్ ను తీశారు.