Monirul Islam punished with 21years imprisonment in minor
girl rape case
అసోంలోని ధుబ్రి జిల్లా ఛతపరా గ్రామంలో 12ఏళ్ళ
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో మొనిరుల్ ఇస్లాం నేరస్తుడిగా నిరూపణ అయింది.
అతనికి బిలాసిపరా అదనపు సెషన్స్ కోర్ట్ న్యాయమూర్తి 21ఏళ్ళ కఠిన కారాగార శిక్ష, రూ.10వేల
జరిమానా విధించారు.
ప్రత్యేక న్యాయమూర్తి ముకుల్ చేతియాఈ కేసులో తీర్పు చెబుతూ, నేరస్తుడు
మొనిరుల్ ఇస్లాం పోస్కో చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని పలు అంశాలను ఉల్లంఘించాడని
నిర్ధారించారు. పోస్కో చట్టం సెక్షన్ 6 ప్రకారం నేరస్తుడికి 21 సంవత్సరాల కఠిన
కారాగార శిక్ష, రూ.10వేల జరిమానా నిర్ధారించారు.
2019 అక్టోబర్ 17న మొనిరుల్
ఇస్లాం 12ఏళ్ళ బాలికపై బలాత్కారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి బిలాసిపరా
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్
చేసి విచారణ కొనసాగించారు. న్యాయమూర్తి 2024 ఫిబ్రవరి 22న తీర్పుచెప్పారు.