ED raids SP leader house and other places in PMLA case
ఒక బ్యాంకును మోసం చేసిన మనీ లాండరింగ్ కేసు
దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. ఉత్తరప్రదేశ్,
మధ్యప్రదేశ్, హర్యానాల్లోని పది ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. అందులో భాగంగా సమాజ్‌వాదీ
పార్టీ నాయకుడు వినయ్‌శంకర్ నివాసంలో కూడా సోదాలు చేసారు.
గంగోత్రి ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థ ఒక బ్యాంకును
మోసగించిందన్న ఆరోపణలపై ఈడీ లక్నోజోన్ అధికారులు ఈ సోదాలు చేపట్టారు. ఆ కంపెనీ రహదారుల
నిర్మాణం, టోల్‌ప్లాజాల నిర్వహణ, ప్రభుత్వ కాంట్రాక్టులు వంటి వ్యాపారాలు
చేస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు వినయ్ శంకర్ తివారీ, రీటా తివారీ, అజీత్
పాండే అనే ముగ్గురు వ్యక్తులు ఆ కంపెనీ ప్రమోటర్లు.
ఈడీ అధికారులు ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, గోరఖ్‌పూర్,
నోయిడా… గుజరాత్‌లోని అహ్మదాబాద్, హర్యానాలోని గురుగ్రామ్, ఇంకా మరికొన్ని
ప్రదేశాల్లో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈడీ గత నవంబర్‌లో ఈ కేసుకు సంబంధించి లక్నో,
మహారాజ్‌గంజ్, గోరఖ్‌పూర్ జిల్లాల్లో రూ.72కోట్లకు పైగా విలువైన స్థిరాస్తులను అటాచ్
చేసింది. అవన్నీ గంగోత్రి సంస్థ ప్రమోటర్లు, డైరెక్టర్లు, గ్యారంటార్లకు చెందినవే.
ప్రధాన నిందితుడు వినయ్ శంకర్ తివారీ
ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి దివంగత హరిశంకర్ తివారీ కుమారుడు, మాజీ ఎమ్మెల్యేగా కూడా
వ్యవహరించాడు.
గంగోత్రి ఎంటర్‌ప్రైజెస్
సంస్థలో ప్రమోటర్లు, డైరెక్టర్లు, గ్యారంటార్లు అందరూ కలిసి, సంస్థకు అప్పుగా
లభించిన రూ. 1129 కోట్ల రుణాలు తీసుకున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని ఏడు
బ్యాంకుల కన్సార్షియం ఆ రుణాలు మంజూరు చేసింది. అయితే ఆ రుణాల్లో ఒక్క పైసా కూడా
బ్యాంకుకు చెల్లించలేదు సరికదా, పూర్తిగా దుర్వినియోగం చేసారు.