ఇంగ్లండ్
తో రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. లంచ్
బ్రేక్ సమయానికి 5 వికెట్లు తీసి ఇంగ్లండ్ జట్టును కష్టాల్లోకి నెట్టారు. కొత్త
బౌలర్ ఆకాశ్ మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటగా అశ్విన్, జడేజా చెరో వికెట్
తీశారు.
టాస్
గెలిచిన ఇంగ్లండ్, ఏడు ఓవర్లకు 37 పరుగులు చేసింది. అరంగేట్ర బౌలర్ ఆకాశ్ దీప్
వేసిన9.2 బంతికి బెన్ డకెట్(11) కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అదే ఓవర్
లో 9.4 బంతికి ఓలీ పోప్ ఎల్బీ ఔట్ అయ్యాడు. డకౌట్ గా పెవిలియన్ చేరాడు. దీంతో 9.4 బంతులకు
ఇగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. మూడో వికెట్ ను కూడా ఆకాశ్
తన ఖాతాలో వేసుకున్నాడు. 11.5 బంతిని ఆడబోయిన జాక్ క్రాలే(42) బౌల్డ్ అయ్యాడు.
దీంతో 57 పరుగులు వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ నష్టపోయింది.
జానీ బెయిర్ స్టో(38)ను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు.
దీంతో 23 ఓవర్లకు ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. జడేజా బౌలింగ్ లో కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా
పెవిలియన్ చేరడంతో లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్
112 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం జో రూట్(20), బెన్ ఫోక్స్(4)క్రీజులో
ఉన్నారు.