భారత్,
ఇంగ్లండ్ మధ్య రాంచీలోని JSCA
ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ వేదికగా
జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి రోజు ఆట ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్
బ్యాటింగ్ ఎంచుకుంది.
ఐదు
టెస్టుల సిరీస్ లో భాగంగా ఇరు జట్లు తలపడుతుండగా భారత్ ఇప్పటికే 2-1 ఆధిక్యంలో
ఉంది. ఈ సిరీస్ ను గెలిచి సమం చేసేందుకు ఇంగ్లండ్ శ్రమిస్తోంది. అందులో భాగంగా
జట్టు కూర్పులో కూడా కీలకమార్పులు చేసింది. పేసర్ మార్క్ వుడ్ ను పక్కన పెట్టి ఓలి
రాబిన్సన్ కు అవకాశం కల్పించింది. షోయబ్ బషీర్ కు తుది జట్టులో అవకాశం కల్పించిన
బ్రిటీషు జట్టు, రెహాన్ అహ్మద్ ను పక్కన పెట్టింది.
ఇంగ్లండ్
ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ క్రీజులోకి రాగా తొలి ఓవర్ ను సిరాజ్ వేశాడు.
ఆరు ఓవర్లకు వికెట్లు నష్టపోకుండా 18
పరుగులు చేశారు.
ఇంగ్లండ్
జట్టు : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్,
జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ
బెయిర్ స్టో, బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), టామ్ హార్ట్ లీ, ఓలీ రాబిన్సన్, షోయబ్
బషీర్, జేమ్స్ అండర్సన్.
భారత
జట్టు : యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్),
శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురైల్ (వికెట్
కీపర్), అశ్విన్, కులదీప్ యాదవ్, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్.