జాబిల్లిపై ప్రయోగానికి అమెరికాకు చెందిన ప్రైవేటు కంపెనీ ల్యాండర్ ఒడిస్సన్ ప్రయోగించిన ల్యాండర్ విజయవంతంగా దిగింది. ఒక ప్రైవేటు సంస్థ ప్రయోగించిన ల్యాండర్ చంద్రునిపై దిగడం ఇదే మొదటిసారి. 1972లో నాసా విజయవంతంగా చేపట్టిన చంద్రమండల యాత్ర తరవాత అమెరికాకు చెందిన ల్యాండర్ చంద్రునిపై దిగడం ఇదే తొలిసారి. గత వారం ఇంట్యూటివ్ మెషీన్స్ అమెరికాలోని కేప్ కెనవెరాల్ నుంచి ఉపగ్రహం ద్వారా ల్యాండర్‌ను పంపింది.
దాదాపు ఐదు దశాబ్దాల తరవాత అమెరికా చంద్రునిపై మరోసారి విజయవంతంగా ల్యాండర్‌ను ప్రయోగించినట్లైంది. అయితే ల్యాండర్ నుంచి వస్తున్న సంకేతాలు చాలా బలహీనంగా ఉన్నాయని ప్రకటించారు. ఈ ప్రయోగం కోసం ఇంట్యూటివ్‌కు నాసా రూ.960 కోట్లు నిధులు అందించింది.
చంద్రుని దక్షిణ ధ్రువానికి 300 కి.మీ దూరంలో ల్యాండర్‌ను దింపారు. మాలాపెర్ట్ ఏ అనే ప్రాంతాన్ని అనువైనదిగా ఎంచుకుని అక్కడ దించారు. వారం పాటు ఇది పనిచేయనుంది.