సీనియర్ నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఐఏడీఎంకే మాజీ నేత ఏవీ రాజుపై కేసు నమోదైంది. నటి త్రిషపై (trisha difermation case) చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆమె న్యాయపోరాటానికి దిగారు. ఇటీవల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఏవీ రాజు, త్రిషపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఏవీ రాజు వ్యాఖ్యలు రాయడానికి కూడా సాధ్యంకాని రీతిలో ఉన్నాయి. దీనిపై కోలీవుడ్ నటులు త్రిషకు మద్దతుగా నిలిచారు. రాజు వ్యాఖ్యలను ఖండించారు.
ఏవీ రాజు తనపై చేసిన వ్యాఖ్యలపై త్రిష తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. న్యాయశాఖ నుంచే సరైన సమాధానం వస్తుందన్నారు. ఏవీ రాజుపై భారీగా పరువునష్టం కేసు వేసి, లీగల్ నోటీసులు పంపారు.
శాసనసభ్యుడు వెంకటాచలాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన ఏవీరాజు, త్రిష వ్యక్తిగత విషయాల్లోదూరి, తీవ్రమైన కామెంట్లు చేశాడు. రాజు చేసిన వ్యాఖ్యలు తమిళనాట పెద్ద దుమారం రేపాయి.