ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన
దేశాధినేతల్లో మోదీకి అగ్రస్థానం దక్కింది. మార్నింగ్ కన్సల్ట్ సర్వే విడుదల చేసిన
జాబితాలో జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ 77 శాతం రేటింగ్ తో
అగ్రస్థానంలో నిలిచారు.
ఈ ఏడాది జనవరి 30 నుంచి ఫిబ్రవరి5 వరకు సంబంధించి
సేకరించిన సమాచారం ఆధారంగా ఈ జాబితా విడుదల చేసినట్లు మార్నింగ్ కన్సల్ట్ సంస్థ
తెలిపింది.
మోదీ తర్వాతి స్థానంలో 64 శాతం ప్రజా మద్దతుతో
మెక్సికో అధ్యక్షుడు మాన్యుయెల్ లోపేజ్ ఒబ్రాడోర్ నిలవగా, స్విట్జర్లాండ్ ప్రధాని అలైన్ బెర్సెట్ 57 శాతం ప్రజామోదంతో
మూడో స్థానంలో ఉన్నారు.
నాలుగు, ఐదో స్థానాల్లో పోలాండ్ ప్రధాని డొనాల్డ్
టస్క్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డి సిల్వా ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొనీ
అల్బనీస్ ఆరో స్థానంలో నిలవగా, ఆయన తర్వాతి స్థానాల్లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, స్పెయిన్ ప్రధాని
పెడ్రో ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొమ్మిదో
స్థానంలో నిలివగా ఆయన నాయకత్వానికి 37
శాతం ప్రజలు మాత్రమే ఆమోదం లభించింది. బ్రిటన్ ప్రధాని రిషి
సునాక్ 27 శాతం జనాదరణతో 12 వ స్థానంలో
నిలిచారు.