ఎడ్ టెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు ఈడీ లుక్ అవుట్ నోటీసులు (lookout notice to byjus ceo) జారీ చేసింది. ఇటీవల ఈ సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. రవీంద్రన్ దేశం విడిచి వెళ్లకుండా చూడాలంటూ సంబంధిన వర్గాలను ఈడీ ఆదేశించింది. గత ఏడాది కాలంలో బైజూస్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి దిగజారిపోయింది.
ఇప్పటికే ఈడీ అధికారులు బెంగళూరులోని బైజూస్ ప్రధాన కార్యాలయంతోపాటు, రవీంద్రన్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. రవీంద్రన్‌పై ఆన్ ఇంటిమేషన్ లుక్అవుట్ సర్క్యులర్ అమల్లో ఉంది. విదేశాలకు వెళ్లేప్పుడు ఈడీకి ముందుగా సమాచారం అందించాల్సి ఉంది. తాజా నిర్ణయంతో రవీంద్రన్ విదేశాలకు వెళ్లే అవకాశం ఉండదు.
బైజూస్ సీఈవో పదవి నుంచి రవీంద్రన్‌ను తొలగించేందుకు వాటాదారులు బోర్డు సమావేశానికి పిలుపునిచ్చారు. కొత్త బోర్డును ఎన్నుకునే అవకాశముంది. రేపు బోర్డు సమావేశం జరగనుంది. వాటాదారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బైజూస్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.