దిల్లీ
లిక్కర్ కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి
నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆరుసార్లు నోటీసులు జారీ చేసి, విచారణకు హాజరుకావాలని
ఈడీ పేర్కొన్నప్పటికీ ఆప్ అధినేత
కేజ్రీవాల్ భేఖాతరు చేశారు. దీంతో ఆయనకు ఈడీ, ఏడోసారి నోటీసులు జారీ చేసింది.
ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని తాఖీదుల్లో పేర్కొంది.
కేజ్రీవాల్
ఈ సారైనా స్పందిస్తారా లేదా అనేది తెలియాలంటే ఫిబ్రవరి 26 వరకు ఆగాల్సిందే. గతంలో
నవంబర్ 2, డిసెంబర్ 21, ఈ ఏడాది జనవరి 3, ఈడీ నోటీసులు జారీ చేసినా కేజ్రీవాల్
మాత్రం స్పందించలేదు. జనవరి 13న కూడా ఈడీ సమన్లు జారీ చేసినా లెక్కచేయలేదు. జనవరి
31, ఫిబ్రవరి 14 న కూడా ఈడీ నోటీసులు పంపినప్పటికీ కేజ్రీవాల్ విచారణకు హాజరు
కాలేదు.
మద్యం
కుంభకోణం కేసులో కేజ్రీవాల్ విచారణకు గైర్హాజరు కావడంపై ఇప్పటికే ఈడీ,
న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోర్టు సమన్లు జారీ చేయడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరయ్యారు. దిల్లీలో
తమ ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష ఉన్నందున వ్యక్తిగత విచారణ నుంచి మినహాయింపు
కోరారు. దీంతో విచారణను మార్చి 16కు కోర్టు వాయిదా వేసింది.
విషయం
కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఈడీ నోటీసులు ఎలా జారీ చేస్తుందని ఆప్ నేతలు ప్రశ్నిస్తున్నారు.