పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలీలో (sandeshkhali violence) చోటుచేసుకుంటోన్న అత్యాచారాలపై ఆ రాష్ట్ర డీజీపీ రాజీవ్ కుమార్ స్పందించారు. సందేశ్‌ఖాలీలో రాత్రంగా అక్కడే ఉండి బాధితుల పిర్యాదులు స్వీకరించిన డీజీపీ, బాధ్యులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటైన సందేశ్‌ఖాలీలో డీజీపీ బుధవారం రాత్రి పర్యటించారు. మహిళలను హింసించే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
ప్రతి పిర్యాదును స్వీకరిస్తున్నట్లు డీజీపీ మీడియాకు తెలిపారు. ఎలాంటి హింసకు దిగినా కఠిన చర్యలుంటాయన్నారు. బుధవారం రాత్రి సితులియా, సర్ధార్పురా, మణిపూర్ పరిసర దీవులను కూడా డీజీపీ సందర్శించారు. అక్కడి పరిస్థితిని గమనించి చర్యలకు ఉపక్రమిస్తున్నారు. లైంగిక హింస, భూకబ్జా ఆరోపణలపై దర్యాప్తునకు జాతీయ మానవ హక్కుల కమిషన్ నియమించిన ప్రత్యేక బృందం ఇవాళ సదేశ్ఖాలీలో సందర్శించనున్న నేపథ్యంలో డీజీపీ ముందస్తు పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు