పంటల కనీస మద్దతు ధరకు
చట్టబద్ధత, రుణమాఫీ,
2020లో రైతులపై పెట్టిన కేసుల విరమణ కోరుతూ చేపట్టిన దిల్లీ మార్చ్ వాయిదా పడింది.
పంజాబ్-హర్యానా సరిహద్దులో
పోలీసులతో ఘర్షణ ఏర్పడటంతో ఆందోళన
తాత్కాలికంగా వాయిదా వేసినట్లు రైతు సంఘం నేతలు తెలిపారు. తదుపరి కార్యాచరణ
శుక్రవారం సాయంత్రం
వెల్లడిస్తామని పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నేత సర్వన్ సింగ్ పందేర్ తెలిపారు.
ఖనౌరీ-శంభు సరిహద్దు వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసుల దాడిని
ఖండిస్తున్నామన్నారు. పోలీసుల లాఠీ ఛార్జీలో చాలా మంది గాయపడ్డారని, మరికొంతమంది
ఆచూకీ దొరకకపోవడంతో దిల్లీ మార్చ్ ను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
రైతులు-హర్యానా
పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఓ రైతు
మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
ఈ ఘటనపై హర్యానా పోలీసు అధికారి
మనీషా చౌదరి స్పందించారు. దాటా సింగ్-ఖానౌరీ సరిహద్దులో నిరసనకారులను పోలీసు
సిబ్బందిని చుట్టుముట్టారని, పంట వ్యర్థాలను తగలబెట్టారని చెప్పారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పాటు కర్రాలతో దాడి చేయడంతో 12 మంది పోలీసులు తీవ్రంగా
గాయపడ్డారన్నారు.
రైతుల ఆందోళనను కట్టడి చేసే
విషయంలో పంజాబ్ ప్రభుత్వం తమకు సహకరించడం
లేదని హర్యానా ప్రభుత్వం చెబుతోంది. బారికేడ్లు ధ్వంసం చేసే వస్తువులను రైతులు తీసుకెళుతున్న
విషయాన్ని పంజాబ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అడ్డుకోవడం లేదంటున్నారు. ఈ
విషయంలో కేంద్ర హోంశాఖ కూడా పంజాబ్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన విషయాన్ని
గుర్తు చేశారు.
రైతులతో చర్చలకు సిద్ధమని కేంద్రప్రభుత్వం
ప్రకటించింది. శాంతియుతవరణం కోసం ఐదో విడత చర్చల్లో భాగంగా నాలుగు ప్రధాన
డిమాండ్లపై చర్చకు కేంద్రంగా సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా
తెలిపారు. నిన్న జరిగిన కేబినెట్ భేటీలో చెరుకు రైతులకు కేంద్రం శుభవార్త
చెప్పింది. 2024-25 సీజన్లో చక్కెర గిట్టుబాటు ధర క్వింటాళ్ళకు రూ.25కు పెంచడంతో 340
పెంచింది.